
People be Alert : దేవరకొండ డివిజన్ జూన్ 13, త్రినేత్రం న్యూస్. SBI RBO నల్గొండ వారి ఆధ్వర్యంలో సైబర్ మోసాల పట్ల మరియు పరిష్కారంపై అవగాహన కార్యక్రమం శనివారం.ఉదయం 6:15 నిమిషాలకు స్థానిక దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు SBISUHC OBC నల్గొండ AO మాడిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ NVT మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, RBI లేదా ఇతర సంస్థల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ SMS లు లింకులు నమ్మి OTP. CVV పాస్వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయరాదని, ఏదైనా అనుమానస్పద లాంటి లావాదేవీలు జరిగినట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కాల్ చేయండి, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో సంప్రదించగలరని అన్నారు.
RM శ్రీ P. పద్మ బాబుగౌడ్ గారి నాయకత్వంలో RBO నల్గొండ ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణ పరిష్కారంపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎన్జీ కళాశాల నల్గొండ, మేకల అభినవ స్టేడియం నల్గొండ, ప్రభుత్వ జూనియర్ కళాశాల దేవరకొండ, ప్రభుత్వ జూనియర్ కళాశాల మిర్యాలగూడ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్బిఐ సిబ్బంది పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమం విజయంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో విశ్వనాథ్,RBO తరుపున చీఫ్ మేనేజర్ శ్రీమతి ప్రీతి గారు, భీమ్ సింగ్ నాయక్, N వెంకట్ రామ్, చరణ్, సోమ, మణిదీప్, నాగార్జున, కృష్ణ, శ్రీకాంత్, శరత్, దేవరకొండ, మల్లేపల్లి, చింతపల్లి, చెరుకుపల్లి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe