
Grand Birthday Celebrations : కూకట్పల్లి జూన్ 10 (త్రినేత్రం న్యూస్) : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ జనప్రియ నగర్ కాలనీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పెనుమాక నాయుడు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు శాలువలు కప్పి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయుడు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ముఖ్యంగా పేద ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక సామాజిక సహాయాన్ని అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నాయుడు విశేష కృషి చేస్తున్నారని పలువురు కొనియాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించడం వ్యాపార రంగంలో ప్రోత్సహించడం ద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ వ్యాపార విజయాలతో పాటు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న నాయుడు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్ గౌడ్, నాగరాజు యాదవ్, ఆర్కే రాజు పటేల్ తో పాటు నాయుడు మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe