
Ban on Alcohol : డిండి (గుండ్ల పల్లి) జూన్ 10, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండలంలోని శాంతి గూడెం గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామసభ సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ గ్రామసభలో పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు వినూత్న నిర్ణయాన్ని తీసుకొని గ్రామములో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.గ్రామంలో బెల్టు షాపులతో పాటు ,నాటు సారా ,గుడుంబా ,తయారీకి స్వస్తి పలకాలని నిర్ణయించారు.
గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల నిర్ణయం మేరకు తీర్మానించడం జరిగిందని సర్పంచ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. తీర్మానాన్ని ఎవరైనా ధిక్కరించినచో, మద్యపానం అమ్మిన, పదివేల రూపాయలు జరిమానా విధించుటకు గ్రామసభ తీర్మానం చేశారు.ఈనెల 15 నుండి ఈ మధ్యపాన నిషేధం అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనయ్య ,పంచాయతీ కార్యదర్శి వేణు ,ఉపసర్పంచ్ వెంకట రమణమ్మ పిచ్చయ్య, వార్డు సభ్యులు ,గ్రామ ప్రజలు, ఆయా శాఖల గ్రామ అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe