
- తీదేడు ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం
- సకల వసతులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
Telangana Government : చింత పల్లి జూన్ 03, త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం చింతపల్లి మండలం తీదేడు ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు.అనంతరం ఆమె మాట్లాడుతూ….కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆమె అన్నారు. నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు,డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని రూపొందించారని ఆమె తెలిపారు.
పాఠశాలల పరిరక్షణలో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని అన్నారు.ప్రతి విద్యార్థికి కార్పొరేట్‌కు దీటుగా సకల వసతులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,గంటెల అలివేలు సోమయ్య,రెడ్డి పద్మ పరమేష్, తీదేడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు సిమర్ల శ్రీను యాదవ్,వీరమల్ల వెంకటయ్య,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
