
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి …తీదేడు గ్రామ సర్పంచ్
Sekhar Reddy : చింత పల్లి మే 23, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండపం నిర్మాణానికి గ్రామ ప్రజలు,యువత స్వచ్ఛందంగా విరాళాలు అందించడం అభినందనీయమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్ అన్నారు.
ఈ సందర్భంగా కలకొండ లక్ష్మి మల్లేశం 1,00116/-(ఒక లక్ష నూట పదహారు రూపాయలు),కుర్మేడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పి.ఏ.సి.యస్ డైరెక్టర్ అండేకార్ అశోక్ 51,000/- యాబై ఒక్క వేల రూపాయల విరాళాలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండప నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

