
Uppal Ring Road Closure : త్రినేత్రం న్యూస్ : ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు… రామంతాపూర్ లేదా హబ్సిగూడ నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకునే విధంగా ఆంక్షలు
నాగోల్, ఎల్బీనగర్ వైపు నుండి వరంగల్ వెళ్ళే వాహనాలు హయాత్నగర్ మీదుగా పెద్ద అంబర్పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పైనుండి లేదా సర్వీస్ రోడ్డు మార్గాన ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది
పీర్జాదిగూడ వైపు నుండి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకొని, అక్కడ యూ టర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది
పీర్జాదిగూడ నుండి నాగోల్ వెళ్లాలంటే ఉప్పల్ భగాయత్ లేఔట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది, నాగోల్ నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కూడా భాగాయత్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.. హుబ్సిగూడ నుండి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపిన ఎంఎంసీ కమిషనర్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

