
Police Seize Lorry : త్రినేత్రం న్యూస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి.పెనుమూరు. పెనుమూరు పోలీసులు 18-02-2026 వ తేదీన చిత్తూరు-పెనుమూరు రహదారిలోని కలవగుంట వద్ద వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా, ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్ లోడుతో వెళ్తున్న TN 23 CP 0721 నెంబర్ గల లారీని గుర్తించి సీజ్ చేశారు.
సీజ్ చేసిన వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం మైన్స్ & జియాలజీ శాఖ, జి.ఎస్.టి శాఖ మరియు రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారికి అప్పగించడమైనది.
ఈ రోజు లారీ యజమాని పై మూడు శాఖల నుండి విధించిన జరిమానాలను మొత్తం చెల్లించి, వాహన విడుదల ఉత్తర్వులను తీసుకుని రావడంతో పెనుమూరు పోలీస్ స్టేషన్ నందు వాహనాన్ని విడుదల చేయడమైనది.
ఆ మూడు శాఖల అధికారులు మొత్తం రూ. 3,42,610/- జరిమానా విధించి వసూలు చేసారు.
వారిదగ్గర వాహన విడుదల లెటర్ తీసుకొని వాహనం విడుదల చేయడం జరిగింది.
అక్రమంగా ఖనిజ సంపదను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, ప్రజలు అటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పెనుమూరు ఎస్.ఐ శ్రీనివాసులు కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

