MLA Nenavat Balu Naik : మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

TRINETHRAM NEWS
MLA Nenavat Balu Naik Women empowerment is the main goal

MLA Nenavat Balu Naik : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని వడ్త్యా తండాలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల నుండి మంజూరైన ₹10. 00లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలపడాలని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ భవనం ద్వారా మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంలో భాగంగా టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేయడం గర్వకారణం అని అన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు ₹10,000 కోట్ల ప్రయాణ భారం తగ్గి, అది నేరుగా కుటుంబాల పొదుపుగా మారింది. ఈ 290 కోట్ల ఉచిత ప్రయాణాలు, ₹10,000 కోట్ల ఆదా కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి ఒక తల్లి మందుల ఖర్చు, ఒక కూతురు చదువుకు ఆసరా, ఒక పేద కుటుంబానికి ఆర్థిక భరోసా అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ పార్వతి, డీ ఈ నాగేష్, ఏ ఈ లు రాజేష్, శంకర్,స్థానిక సర్పంచ్ జగన్ నాయక్,పంచాయతీ కార్యదర్శి నమ్రజా,మాజీ ఎంపీటీసీ బిక్కు నాయక్,సీనియర్ నాయకులు నర్యా నాయక్ , శంకర్ నాయక్,సత్యం ప్రజాప్రతినిధులు,మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top