
Bhubharati : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్:ఏప్రిల్ 02 : తెలంగాణ రాష్ట్రంలోని ఐదు మండలాల్లో గురు వారం నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను ప్రయోగత్మకంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్,సంగారెడ్డి జిల్లా వట్ పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి,మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్‌ను రూపొందించామని ఆయన తెలిపారు.
భూవివాదాల పరిష్కారా నికి ఇది తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్‌లో ముందుకు వెళ్లాలని నిర్ణయించామ న్నారు. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను రైతు కోణంలో రూపొందిం చామని, సామాన్య రైతాం గానికి ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూభారతి పోర్టల్ ప్రారంభానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్‌ను రూపొందించా మని మంత్రి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

