
Welspun Foundation : త్రినేత్రం న్యూస్/ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్… వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగరగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రంథాలయంలో ఒక ముఖ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బి. స్వరూప మహేందర్ గౌడ్ ఉప సర్పంచ్ విష్ణు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్‌స్పన్ ఫౌండేషన్ తెలంగాణ CSR హెడ్ సురేఖ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. మొత్తం రెండు సెట్ల పుస్తకాలను అందించడం విశేషం.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫోన్ల వినియోగం వల్ల సమయం వృథా కాకుండా, ఈ పుస్తకాలను ఉపయోగించుకొని వివిధ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు మహిపాల్, నాగరగూడ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి SK అజీమ్, అలాగే వెల్‌స్పన్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ యువత కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం గ్రామ యువతలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో మంచి అవకాశాల వైపు దారి చూపుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

