
Chandana Nageshwar : త్రినేత్రం న్యూస్, కడియపు సావరం, మార్చి 29 (2026): కడియపు సావరం గ్రామంలో సాపిరెడ్డి కుటుంబం నిర్వహించిన పుష్పవతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చందన నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కడియపు సావరం వైఎస్ఆర్సిపి నాయకుడు సాపిరెడ్డి బుల్లి వెంకన్న, శ్రీమతి రామలక్ష్మి దంపతుల కుమార్తె వైష్ణవి రామశ్రీ పుష్పవతి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

