MLAs Paid Tribute : తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి నివాళి అర్పించిన ఎమ్మెల్యేలు

TRINETHRAM NEWS
MLAs paid tribute

పెద్దాయనకు ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ కాలువ, ఎమ్మెల్యే అమిలినేని, టీడీపీ నాయకులు

MLAs Paid Tribute : త్రినేత్రం న్యూస్ : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెద్దాయనగా పిలిచే నాయకుడు, వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి పదవి చేపట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన నేత మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం జిల్లా పార్టీకి, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తీరని లోటని ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు..

గత 60 రోజులుగా అనారోగ్యంతో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉన్నం హనుమంతరాయ చౌదరి ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారన్నా విషయం తెలుసుకున్న రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, స్థానిక టీడీపీ నాయకులతో కలసి ఉన్నం స్వగ్రామం యర్రంపల్లి గ్రామంలో వారి నివాసంలో పెద్దాయనకు పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు..అనంతరం కుటుంబ సభ్యులు వారి సతీమణి లక్ష్మీదేవి, కుమారుడు మారుతి చౌదరిలను పరమార్శించి వారికి మనోధైర్యం కల్పించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top