
MLA Kandula Narayana Reddy : త్రినేత్రం న్యూస్ : తేది :21.3.2026. మార్కాపురం పట్టణం. ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని పెద్ద నాగులవరం రోడ్లో ఉన్న ఈద్గా వద్ద మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చిన్నప్పుడు నుంచి ముస్లిం సోదరుల మధ్య పెరిగానని అల్లాహ్ దయవల్ల మార్కాపురం జిల్లా వచ్చిందని జిల్లాతో పట్టణంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతారని త్వరలోనే అల్లాహ్ దయతో వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా త్వరలో తయారు చేస్తామని తద్వారా ఈ ప్రాంతంలో పండ్ల పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతుందని, ఫ్యాక్టరీలు వస్తాయని అన్ని రకాల పండ్లు ఈ ప్రాంతం లో విక్రయించేది అధిక సంఖ్యలో ముస్లింలైనని హార్టికల్చర్ హబ్ తో ముస్లిం మైనారిటీలు అభివృద్ధి చెందుతారని అన్నారు. అదేవిధంగా నిన్న వర్షంతో ఈ ఈద్గా ప్రాంతం కొంతమేర బురదమైనదని త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం కోసం సంవత్సరానికి రెండు లక్షల రూపాయలతో మూడు సంవత్సరాల్లో ఆరు లక్షల రూపాయలు తన సొంత నిధులు వెచ్చించి ఈద్గా ప్రాంతంలో గ్రానైట్ బండలు పరచి శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముస్లిం సోదరుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.
ఈ సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

