NHM Employees Protest : ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు నిరసన

TRINETHRAM NEWS
NHM employees protest

మధ్యాహ్నం భోజన విరామం సమయంలో నల్ల రిబ్బన్స్ పెట్టుకొని నిరసన తెలిపిన ఉద్యోగులు

NHM Employees Protest : త్రినేత్రం న్యూస్ జనగాం జిల్లా ప్రతినిధి… జనగాం జిల్లా లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు లంచ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి వేతనాలు ప్రభుత్వం తక్షణమే వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులకు నిరసన వ్యక్తం చేసిన ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎమ్) కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుకు తమకు రావలసిన 5 నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ .. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్. రేవతి మాట్లాడుతూ… . నెలల తరబడి జీతాలు అందక ఉద్యోగులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ఆవేదన– జీవన సంక్షోభం వేతనాల అలస్యంతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.. ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు విద్యుత్ బిల్లులు పెండింగ్లో పడటం.. పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేక ఒత్తిడి గురికావడం
ఈఎంఐలు (వాయిదాలు) నిలిచిపోవడం (గత సంవత్సరం 2025 సెప్టెంబర్ నుండి జనవరి 2026 వరకు) మొత్తం 5 నెలల వేతనాలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వాన్ని చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ ఆఫీసర్ లావణ్య, ఫార్మసీ ఆఫీసర్ స్వప్న, ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి, ఎన్ సి డి ఏ.ఎన్.ఎం. రాజకుమారి స్వప్న, అనిత మంగ ఉపేందర్ , మణెమ్మ సపోర్టింగ్ స్టాప్ నరేష్ ,కవిత తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top