
Ugadi Awards : దేవరకొండ డివిజన్ మార్చ్ 17, త్రినేత్రం న్యూస్. హైదారాబాద్ లోని బ్రాహ్మణపల్లి ప్రాంతంలో పరిణయ కన్వెన్షన్ లో గుర్రం పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి గర్జన ఉగాది పురస్కారాల్లో రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తో కలిసి జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు & పి ఏ సీ ఎస్ చైర్మన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పౌరుషానికి పరోపకారానికి రెడ్డి కులస్తులు ప్రతీకలు సాటి మనిషికి సహాయం చేయడం మన నైజం అదే విధంగా సమాజంలోని అన్ని కులాలు వర్గాల వారిని సమత మమతా భావాలతో దగ్గరకు తీయడం రెడ్డి బంధువుల నరనరాలకు జీర్ణించుకుపోయింది ఈ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా దృడసంకల్పంతో ఆవిర్భవించిందే రెడ్డి గర్జన అని అన్నారు.
అనంతరం నరసింహారెడ్డి ని శాలువాతో సత్కరించి రాజకీయ రంగంలో ఆయన చేసిన సమాజ సేవలను గుర్తించి ఉత్తమ నాయకునిగా ఉగాది పురస్కారం అందజేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

