Best Wishes : శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షులు

TRINETHRAM NEWS

Best Wishes పోలవరం జిల్లా : మార్చి 14 : (త్రినేత్రం న్యూస్); కుక్కునూరు మండలంలో జనసేన పార్టీ పదమూడు వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ ఆ పార్టీ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కడి పార్టీ స్థాపించాడని గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ చరిత్రలో ఆ పార్టీని ప్రతి ఒక్కరూ గర్వంగా మాట్లాడుకునేలా తీర్చిదిద్దారు అని సూచించారు. మెయిన్ సెంటర్ లో భారీ ర్యాలీ నిర్వహించి కేకులు కట్ చేసి ఒక ఉత్సవంలా నిర్వహించడం జరిగింది. తదుపరి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి, ఆ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాలు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన మరియు ఉపాధ్యక్షులు మోదుపూరి వెంకన్న, బాబు, గ్రామ కన్వీనర్ లు సీతారామయ్య, కోటి నూకల వినోద్, ఆవుల శ్రీను, గాడిద దినేష్, కిరణ్, దామరచర్ల నవీన్, పసుపులేటి ముదిగొండ, రఫీ, చీర వెల్లి ధనస్వామి, నాగరాజు, ప్రకాష్, ఓ మీడియా కన్వీనర్ లు, రాయల రాజ్ కుమార్, గరగ జగదీష్, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Presidents who expressed their best wishes.

You cannot copy content of this page

Scroll to Top