రాజంపేట : 14-3-2026 : కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు… జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శివరామ రాజు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ ఉద్యమి, సాధక్ లు మరియు అభిమానుల సమక్షంలో ముందుగా జనసేన పార్టీ జెండాను ఎగరవేసిన యల్లటూరు శివరామ రాజు.
తదుపరి కార్యాలయంలో అందరి సమక్షంలో ఆనందంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యల్లటూరు శివరామ రాజు మాట్లాడుతూ ప్రజల ఆశయాలతో పెరిగిన ఒక ఉద్యమం,ఇప్పుడది కోట్లాది మంది నమ్మకంగా మారిందని, జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల కథ పూర్తి కాదని,ఇప్పుడు జనసేన పార్టీ ప్రజ్వలలా ప్రకాశిస్తూ ప్రభంజనంలా పరిభ్రమించిందని. మహోన్నత ఆశయ సాధన కోసం నిజాయతీ నీడలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడలో మనమందరం మమేకమవుదాం అని తెలిపారు.


