జూలై 16, 2026
TRINETHRAM NEWS

డిండి మండల విద్యాధికారి :– నరసింహా.

డిండి ( గుండ్ల పల్లి),మార్చి 13 , త్రినేత్రం న్యూస్. ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 11 వరకు నిర్వహించబడతాయని, పబ్లిక్ పరీక్షలు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిండి మండల విద్యాధికారి నరసింహ తెలియజేశారు. డిండి మండల కేంద్రంలో రెండు పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేసినట్లు,,మోడల్ స్కూల్లో 200 మంది విద్యార్థులు,,ఆర్పిఆర్పి పాఠశాలలో 176 మంది మొత్తం 376 మంది పరీక్షలు రాయబోతున్నట్లు ఆయన తెలిపారు.

ఒక్కొక్క పరీక్ష కేంద్రంలో చీప్ సూపర్డెంట్ తో పాటు ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ ను పదిమంది ఇన్విజిలేటర్లను , ఒక పేపర్ కస్టోడియను నియమించినట్లు ఎంఈఓ తెలిపారు .ఉదయం తొమ్మిది 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని, పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని ఆయన సూచించారు, పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు, మంచినీటి సౌకర్యము, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యము ఉంటాయని ఆయన తెలిపారు ఈ సందర్భంలో పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Arrangements for SSC public exams

You cannot copy content of this page