త్రినేత్రం న్యూస్ : Mar 13, 2026, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ నెల 16 నుంచి 23 వరకు తెలంగాణంలోని పలు జిల్లాల్లో వారంపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ముఖ్యంగా 15,16 తేదీల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


