ఏలూరు జిల్లా : మార్చి 11 : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, సూరేపల్లి, య ల్లాపురం గ్రామ కార్యదర్శి లు కె నాగ శిరోమణి, రభ్య సుల్తాన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం పాలన అద్భుతం అని తెలిపారు. ఆయా పంచాయితీలలో డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం పెన్షన్లు గురించి వివరించి చెప్పారు.
వాళ్ల సచివాలయాలలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో పేర్కొన్నారు. ఇంటి పన్నుల కూడా సూచించారు. గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేస్తుందని వాళ్ల సంతోషాన్ని వ్యక్త పరిచారు. గ్రామాలలోనే కాకుండా రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాయని వాళ్లు అనడం జరిగింది.
గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆ గ్రామాలకు వచ్చిన నిధులు గురించి, వాటిని వేటికి ఉపయోగించారో పేర్కొన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


