మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సామాజికవేత్త, బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.
దేవరకొండ డివిజన్ మార్చ్ 08, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవరకొండ నియోజకవర్గంలో, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మరియు సామాజిక సేవ దృక్పథం కలిగిన మహిళ ప్రముఖులను గుర్తించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సామాజికవేత్త, బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో సేవ చేస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ, సమాజంలో అగ్రగామిగా ఉంటూ చాలా మంది మహిళలనుచైతన్యపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి సంధ్య రెడ్డి, పుణుగురి లింగయ్య, రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేశ్, చేరిపల్లి జయలక్ష్మి, పెరికేటి శ్రీనివాస చారి, పున్న బిక్షమయ్య, భీమగోని శివ గౌడ్, వనం చంద్రకళ, బి.సి హాస్టల్ వార్డెన్ (బాలికలు) రేణుక, డాక్టర్ విజయ, డాక్టర్ శశికళ, డాక్టర్ రుణాదేవి, శిరీష, సావిత్రి, ఎం.ఏ ఖాలిక్, శిగ శ్రీనివాస్, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ,సన్మానాన్ని పొందిన మహిళలు మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


