Happy Holi : దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

అందరి జీవితాల్లో నిత్య వసంతం వెల్లివిరియాలి
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ మార్చ్ 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నిత్య వసంతం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

హోళీ నేపథ్యంలో పల్లెల్లో వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటాపాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సింగిడి రంగుల నడుమ కేరింతలతో సాగే హోలీ.. మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని అందిస్తుందని తెలిపారు.

భేదభావాలను వీడి పరస్పర ప్రేమ, అభిమానాలను చాటుకొంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ సర్కార్ చేపట్టిన ప్రగతి కార్యాచరణ.. తెలంగాణలోని దళిత, బహుజన, సకలజనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy Holi to the people of Devarakonda

You cannot copy content of this page

Scroll to Top