MLA Nenavath Balu Naik : ఇంటింటికీ చేరుతున్న అభివృద్ధి, సంక్షేమం

TRINETHRAM NEWS

పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 28, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఎర్రగుంట పల్లి, వావిల్ కోల్ రహమంతాపూర్,కందుకూరు, సింగరాజుపల్లి, తవక్లాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య కార్యాలయ భావన నిర్మాణ పనులకు సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.

కందుకూరు స్కూల్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేసిన అనంతరం సీసీ రోడ్డును ప్రారంభించారు. సింగరాజు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి, గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శక్రు తండాలో 5.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
తవక్లాపూర్ గ్రామం నుండి వీరబోయినపల్లి వై జంక్షన్ వరకు 223.00 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళా సంఘాల బలోపేతానికి ఈ వీ ఓ భవనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Development and welfare reaching every household

You cannot copy content of this page

Scroll to Top