Employment Guarantee Scheme : ఉపాధి హామీ పథకం పై 15 రాష్ట్రాల మంత్రిత్వ శాఖ అధికారుల పర్యటన.

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా ఫిబ్రవరి 27, (త్రినేత్రం న్యూస్): ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులపై సంతృప్తి. ఇతర రాష్ట్రాలలో ఈ తరహా పనులపై దృష్టి. విశాఖపట్నం జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ( వి బి జి రాంజీ) అంశంపై వివిధ మంత్రిత్వ శాఖలు మరియు 15 రాష్ట్రాల అధికారుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండల కేంద్రంలో ఫీల్డ్ విజిట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ( ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ) మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ కింద అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫార్మ్ పాండ్‌, హార్టికల్చర్ , పశువుల తాగునీటి తొట్టెలు, ట్రెంచ్ పనులు, మ్యాజిక్ డ్రైనేజ్ , సోక్‌పిట్స్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వంటి పనులను తార స్థాయిలో పరిశీలించి, వాటి ఉపయోగకర మరియు ప్రభావాన్ని అధికారులు తెలుసుకున్నారు. ఫీల్డ్ విజిట్ సందర్భంగా అధికారులు పనుల నాణ్యత, ప్రయోజనాలు మరియు గ్రామీణ జీవనోపాధిపై వాటి ప్రభావాన్ని ప్రశంసించారు.

తమ రాష్ట్రాలలో కూడా ఈ విధమైన పనులను సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు , సీడబ్ల్యుఈఎల్ హెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, డాక్టర్ పళ్ళ అనురాధ , ఫ్యాకల్టీ, విద్య సాగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్, మరియు మినిస్ట్రీ అఫ్ రూరల్ డెవలప్మెంట్ , మరియు భారత ప్రభుత్వం ప్రతినిధులు పాల్గొన్నారు.
మరియు 15 రాష్ట్రాల నుండి వచ్చిన అధికారులు మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిపి సుమారు 30 మంది అధికారు ఏజెన్సీ ప్రాంతం ఉపాధి పనుల పైన అవగాహన పెంపొందించి, రాష్ట్ర స్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంచారు.
ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంపొందించి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ఇది దోహదం చేయనుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

employment guarantee scheme.

You cannot copy content of this page

Scroll to Top