Sekhar Reddy : ప్రతి ఒక్కరు భవానీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి

TRINETHRAM NEWS
  • శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి జాతర వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
  • శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి గుట్ట మీద దక్షిణ మండప శంకుస్థాపన
  • ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్

చింత పల్లి ఫిబ్రవరి 25, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరు శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి గ్రామ పాలక వర్గం,గ్రామ ప్రజలతో అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్ట అభివృద్ధి కోసం దేవాలయం వద్ద దక్షిణ మండపం (హాల్) శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ…రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,ఆలయ అర్చకులు సురభి సత్యనారాయణ శర్మ సోదరులు, మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు, ఉలుపాల శేఖర్ రెడ్డి, సోనగంటి గొవర్థనాచారి, పి.ఏ.సి.యస్ మాజీ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,గ్రామ పెద్దలు మర్రు రామారావు, మోర కిరణ్, అంకం అంజూర, తిరుమణి వెంకటయ్య, జూలురి శ్రీధర్, మర్రు శ్రీనివాసరావు, కాయితి బచ్చిరెడ్డి, మర్రు సురెందర్ రావు,జెల్ల వెంకటేశ్వర్లు, రాశిక పాండయ్య, నేలపట్ల మురళి, వీరమల్ల వెంకటయ్య, సిమర్ల శ్రీను యాదవ్, బొడ్డు యాదగిరి, రెడ్డి పరమేష్,ఇడమోని శ్రీను యాదవ్,ఉడుత శంకరయ్య, సివర్ల శంకర్, మెరిక శంకరయ్య, చింతకుంట్ల రాకేష్,వలమోని వెంకటయ్య, మెండె మల్లయ్య, సందె శంకర్, పంబాల చెన్నయ్య, సందె బిక్షం, కొన్రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

blessings of Bhavani Ramalingeswara Swamy

You cannot copy content of this page

Scroll to Top