Gangabhavaniswara Temple : గంగాభవానీశ్వర ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని గోన బోయినపల్లి గ్రామంలోని శ్రీ గంగాభవానిశ్వర ఆలయంలో ధ్వజ శిఖర యంత్ర నాగేంద్ర జంటనాగుల మరియు పోతురాజు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్రోక్తంగా నిర్వహించారు.
సకల పాపాలను హరించే గంగమ్మ దేవాలయంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మరియు గంగపుత్ర రాష్ట్ర సంఘం అధ్యక్షులు మాగిలిపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు గంగపుత్ర సంఘం సభ్యులు ఇంతటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

సర్పంచ్ బాలనారాయణ ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు.భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు గ్రామ పెద్దలు మహిళలు మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు కాక హైదరాబాద్ వాసులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top