Trinethram News : మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఆవిష్కరించిన మంత్రి సీతక్క… మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి – మంత్రి సీతక్క
మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలుపరుస్తున్నాము… మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ఎన్నో రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నాం… 46.68 లక్షల మహిళలు 4.37 లక్షల shg ల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది… మహిళల ఆర్థిక ప్రగతి ద్వారానే సమాజం ఆర్థికంగా పురోగమిస్తుంది అన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నాం
ఈ రెండు ఏళ్లలో మహిళా సంఘాలకు రూ. 35,435 కోట్ల బ్యాంకింగ్ రుణాల మంజూరు చేశాము… ఇందిరా మహిళా శక్తితో 2.05 లక్షల సూక్ష్మ వ్యాపారాలను మహిళా సంఘాలు స్థాపించాయి… ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలకూ రూ. 1,121 కోట్లు వడ్డీలను మాఫీ చేశాము… మహిళా స్వయం సహాయక సభ్యులకు లోన్ బీమా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము…
ఆర్థిక వ్యాపారాల్లో మహిళా సంఘాలకు ప్రాధాన్యత నిస్తున్నాము… సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళా సంఘాలకు రూ. 3.5 కోట్లు లాభాలు వచ్చాయి… మహిళా స్వయం సహాయక బృందాలకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాల చే ఏర్పాటు చేయిస్తున్నాం… జిడిపిలో మన దేశ మహిళల భాగస్వామ్యం 18 శాతమే నమోదయింది
అదే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం 40 శాతంగా ఉంది… మహిళల వృద్ధితోనే దేశ ఆర్థిక వేగం పుంజుకుంటుంది… అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకర్లు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మహిళా సాధికారతను మరింత వేగవంతం చేయవచ్చు
- మంత్రి సీతక్క ప్రసంగాన్ని ప్రశంసించిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీతక్క ప్రసంగంలో మహిళా సాధికారత ప్రతిధ్వనిస్తోంది అన్న పెమ్మసాని
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


