త్రినేత్రం న్యూస్.. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బాధ్యతా సేవా సంస్థ రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామం సుబ్బారావు పేట లో మంగళవారం ఉదయం మద్దా నూతయ్య,వనులమ్మ నివాసం ఉంటున్న తాటాకుఇల్లు అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి
వారికి బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు కాతేరు గ్రామ పార్టీ కమిటీ సభ్యులతో కలిసి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, 25 కేజీల బియ్యం, నగదు, అందజేశారు, స్థానిక పార్టీ నేత పెనుమాక సునీల్ బాధిత కుటుంబానికి కూరగాయలు మూడువేల రూపాయలు నగదును అందజేశారు,
గిరజాల బాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 6000 రూపాయలు అందించి ఆదుకున్న పార్టీ నాయకులు ఆచంట కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ..అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధితులకు
దాతలు ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు,పార్టీ గ్రామ కమిటీ సభ్యులు సహాయంతో తాత్కాలిక రేకు షెడ్ నిర్మిస్తామని ముందుకు వచ్చారు ఇంటిలోని సామాను కాలిపోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితుల కు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తపల్లి నాగేశ్వరరావు, మానుకొండ వెంకట్రావు, అత్తిలి శ్రీనివాసు, కొల్లు నాని, గాలిగి జయరాజ్, చెరుకూరి బాస్, సర్కార్ భాష, పున్నమరాజు వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


