India AI Summit : ఇండియా ఏఐ సమ్మిట్‌ ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఇండియా-ఏఐ సమ్మిట్‌ 2026 ప్రారంభించారు. కృత్రి మేధ(ఏఐ)పై వారం రోజులపాటు విస్తృత చర్చలు, ఒప్పందాలు, సాంకేతిక ప్రదర్శన మొదలైనవి ఈ సందర్భంగా చోటుచేసుకోనున్నాయి.

ప్రధాని మోదీ అనేక అంకుర సంస్థలను సందర్శించి వాటి సాధనాల గురించి వివరాలు తెలుసుకున్నారు.

70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన ఎక్స్‌పో గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములుసహా 600 పైగా స్టార్టప్‌లను ఒక దగ్గరికి చేర్చింది. 300 పైగా స్టాళ్లు, లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌సహా 13 దేశాలు ఇందులో పాల్గొనడం ద్వారా ఏఐ రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యంపై వాటి ఆసక్తిని వెల్లడించాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India AI Summit kicks off

You cannot copy content of this page

Scroll to Top