The doer ‘KCR’ : కార్యసాధకుడు ‘కేసీఆర్’

TRINETHRAM NEWS

బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచి
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ప్రకటించని హామీలను కూడా ఒక్కోటి నెరవేరవేర్చిన మాహానేత కేసీఆర్

-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 17, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కార్యసాధకుడు అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అభివర్ణించారు.మంగళవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చందంపేట మండలం పాత కంబాలపల్లి గ్రామానికి చెందిన 50కుటుంబాలు బిఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిర్వర్తించిన కృషి చరిత్రాత్మకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ప్రకటించని హామీలను కూడా ఒక్కోటి నెరవేరవేర్చిన మాహానేత కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మాదిరి దేశం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆయన తెలిపారు.అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది అని ఆయన తెలిపారు.

మహిళలకు, యువతకు, రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారు అని ఆయన అన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The doer 'KCR'

You cannot copy content of this page

Scroll to Top