Free medical camp : మురమండ గ్రామంలో సాధనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… కడియం మండలం మురమండ గ్రామంలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం శ్రీ శ్రీ బసవేశ్వర స్వామి సులాల సంబర మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్య లక్ష్యముగా చేసుకుని చందన నాగేశ్వర్ డాక్టర్ చందన పర్వత వర్ధిని ఆధ్వర్యంలో సాధన ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని మురమండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో మహిళ రోగ వైద్య సేవలు, కంటి వైద్య సేవలు, గుండె సంబంధిత వైద్య సేవలు, పిల్లల వైద్య సేవలు ఉచితంగా నిర్వహించారు. ఈ క్యాంపులో డాక్టర్ల సూచనల మేరకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ … సాధన ఫౌండేషన్ రాజమండ్రి రూరల్ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభించడం చాలా మంచి శుభ పరిణామం. ఈ ఉచిత వైద్య శిబిరాలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే, నా వంతు కృషి చేస్తాను. సాధన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.” అని తెలియజేసి అభినందనలు తెలిపారు.అనంతరం డా. చందన పర్వత వర్దిని మాట్లాడుతూ..,సాధన ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత చదువు, వృత్తి విద్య నైపుణ్యాలు నేర్పించడం – చిన్నపిల్లలకు మంచి చదువు ఇవ్వటం, వారికి సరైన ఆరోగ్యం, తిండి – పూర్తి సంతోషకరమైన అభివృద్ధి.

ఆరోగ్య అవగాహన వర్క్‌షాప్‌లు, శిబిరాలు. బాలికల చదువు ప్రోత్సాహం, గ్రామాల్లో ఆరోగ్య చెకప్‌లు, సహాయ సేవలు, ప్రభుత్వం, ఇతర సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున మార్పుతీసుకురావడం.చిన్నారులు రక్తమార్పిడి చేసుకుంటూ ఉండటం వల్ల వారి ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధనా ఫౌండేషన్ ఇలాంటి చిన్నారులకు నిరంతర సహాయం చేస్తుంది – వారి ఆరోగ్యం మెరుగుపడి, సంతోషంగా జీవించేలా చూసుకోవడమే సాధనా ఫౌండేషన్ లక్ష్యం. వీరందరి ఆశీర్వాదాలు, మద్దతు ఈ సేవా ప్రయాణానికి మరింత బలం చేకూర్చాయనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గిరిజాల బాబు, స్టాలిన్, తడాల చక్రవర్తి, రావిపాటి రామచంద్రరావు, తిరుమల శెట్టి వాసు, దొంతంశెట్టి వీరభద్రరావు, కొండపల్లి పట్టియ, కొండపల్లి సత్యనారాయణ ప్రసాద్, ఊటుకూరు శైలజ. డాక్టర్ అక్కల బాబ్జి రత్న సుధీర్, దీపిక, డాక్టర్ సంతోష్, డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ వినీత, డాక్టర్ సాయికుమార్, డాక్టర్ సౌమ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free medical camp by Sadhana Foundation

You cannot copy content of this page

Scroll to Top