బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 15, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం గుడిపల్లి మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఈసందర్భంగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు మరియు నల్గొండ జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……దైవ చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెల్లుగూరి వల్లపు రెడ్డి,గ్రామ సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి,మునగాల అంజి రెడ్డి,అర్వపల్లి నర్సింహ, తోటకూరి పరమేష్,ఎర్ర యాదగిరి,ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


