Ravindra Kumar : ఎల్లవేళలా అందుబాటులో ఉండే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

TRINETHRAM NEWS

మాజీ శాసనసభ్యులు :- రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 09 త్రినేత్రం న్యూస్. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవరకొండ పట్టణానికి చేసిందేమి లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరైనా గడిచిన రెండు సంవత్సరాల్లో మీ దగ్గరకు వచ్చారా..? మీ సమస్యల పట్ల ఆరా తీశారా?
దయచేసి ఆలోచించండి ఎన్నికల సమయంలో కాకుండా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలవల్ల నష్టపోయిన ప్రజలు మళ్ళీ కేసీఆర్ ను కోరుకుంటున్నారు.
రాష్టంలో కేసీఆర్ రావాలంటే ఆ మార్పు మనం ఈ ఎన్నికల నుండే మొదలు పెడుదామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని అని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS party candidates who are always available

You cannot copy content of this page

Scroll to Top