Shambhipur Krishna : గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం

TRINETHRAM NEWS

Trinethram News : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంభీపూర్ క్రిష్ణ తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు సాయంత్రం పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ కాజిపల్లి 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గద్దె సుష్మ గణేష్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS candidates' victory in Gaddapotharam Municipality

You cannot copy content of this page

Scroll to Top