Rajineni Venkateswara Rao : ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజాస్వామ్యం ఖూనీ

TRINETHRAM NEWS

రాజీనేని వెంకటేశ్వరరావు
బీ ఆర్ ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షులు.

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 01 త్రినేత్రం న్యూస్. తెలంగాణ సాధకుడు, ఉద్యమ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కే సీ ఆర్) పై ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగ విలువలను కాలరాస్తూ
దుర్మార్గపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్నఅరాచక,నియంతృత్వ చర్యలకువ్యతిరేకంగా,కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో డిండి మండల కేంద్రం లో రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం జాతీయ రహదారి పై ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు,రాఘవాచారి, డిండి బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్ మల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బలముల తిరుపతయ్య, పీర్ మహ్మద్, మహ్మద్ నజీర్ , రవీందర్ రావు, గొడుగు వెంకటయ్య, సర్య నాయక్, వెంకట్రామ్ రామావత్, తండు వెంకటయ్య గౌడ్, ఎండీ రషీద్,గంజి సురేష్, గుర్రం సురేష్, ఎండీ బాసీత్, గొడుగు శ్రీశైలం, సీమర్ల మల్లయ్య, పాలే సూరి, కటికర్ల రామ లక్ష్మయ్య, బలమూరి రామ లక్ష్మయ్య, బుష్పాక రామస్వామి, అంకల్,మాజీ ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Democracy murdered in the name of phone tapping

You cannot copy content of this page

Scroll to Top