Minister Reveals Cause of Ajit Pawar’s Death : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి కరణం తెలిపిన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు

TRINETHRAM NEWS

Trinethram News : బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్‌ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్‌ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే క్లియరెన్స్‌ కోసం బారామతి అధికారులను సంప్రదించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో విజిబులిటీ చాలా తక్కువగా ఉండటంతో.. ‘రన్‌వే కనిపిస్తుందా? లేదా??’ అని పైలట్లను బారామతి అధికారులు అడిగారు.

దీంతో క్లియరెన్స్‌ రాలేదని, ఈ క్రమంలో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్టు మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని అధికారుల ప్రశ్నకు పైలట్లు సానుకూలంగా స్పందించడంతో క్లియరెన్స్‌ ఇచ్చారని తెలిపారు.

ఈ క్రమంలో ఉదయం 8.42 గంటల సమయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించగా.. విజిబులిటీ సమస్యలతోపాటు నియంత్రణ కోల్పోవడంతో రన్‌వేకు దగ్గరగా ఉన్న ఓ బండరాయికి ఢీకొని 8.48గంటల ప్రాంతంలో పెద్ద మంటతో విమానం కూలిపోయినట్టు సమాచారం. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో ఎరౌండ్‌ పాటించారని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నట్టు తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్‌ రాలేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rammohan Naidu reveals the cause of Ajit Pawar's death

You cannot copy content of this page

Scroll to Top