బుధవారం ప్రారంభమై 4 రోజుల పాటు జరగనున్న వనజాతర
సారక్క ఆగమనంతో మొదలు కానున్న మహాజాతర
ఏలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
Trinethram News : బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు… జంపన్నవాగులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు…. మేడారం మహా జాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది
ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం రూ.251 కోట్ల వ్యయం చేసింది… మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలోవిధులు నిర్వహించనున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


