అల్లూరిజిల్లా అరకులోయ జనవరి 27, (త్రినేత్రం న్యూస్): గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన అరకులోయ మరోసారి పర్యాటకులకు కనువిందు చేయనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘విశాఖ ఉత్సవ్’లో భాగంగా ఈ ఏడాది అరకు ఉత్సవం 2026ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జనవరి 24న విశాఖలో ప్రారంభమైన ఉత్సవాలు, అరకులో జనవరి 30, 31, ఫిబ్రవరి 1న 3 రోజులపాటు జరగనున్నాయి అని తెలిపారు. అలానే ఫిబ్రవరి 1న అరకులో గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి. ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. 8–10 రాష్ట్రాల గిరిజన కళాకారులతో లైవ్ ప్రదర్శనలు, హాట్ ఎయిర్ బెలూన్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్, హస్తకళల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాఫీ టూరిజం, కలినరీ టూరిజం వంటి సరికొత్త కాన్సెప్ట్స్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. గిరిజన రైతులే గైడ్లుగా మారి పర్యాటకులకు కాఫీ సాగు విధానాలు వివరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, వైటిడిఏ పీఓ, ఇన్చార్జి డీఆర్ఓ అంబేద్కర్, ఆర్టీవో లోకేశ్వరరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


