జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 24 :నెల్లూరు జిల్లా :కావలి : ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రుద్రకోట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు,ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి రుద్రకోట గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర , స్వర్ణ ఆంధ్ర ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మనవహారం నిర్వహించిన ఎమ్మెల్యే, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని, విద్యార్థులే స్వచ్ఛతకు రాయబారులుగా మారాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swachh Andhra Swarna Andhra needs people's participation

You cannot copy content of this page