First FIR : బాధితుల ఇంటి వద్ద నుండి తొలి FIR నమోదు చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్

TRINETHRAM NEWS

ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు..

బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే FIR నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేసినారని ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు.

నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వికాళాంగురాలు భూమా రమాదేవి భర్త వేధిస్తున్నాడు, కొడుతున్నాడు అని డయల్ 100 కు ఫోన్ చేయగా సంచారం అందుకున్న నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి FIR కాపీని బాదితురాలికి అందించారు అని తెలిపినారు.

FIR ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా మహిళలపై, పిల్లలపై, వృద్దులపై దాడులు, దొంగతనాల, భౌతిక దాడులు, బాల్య వివాహాలు, వేదింపులు వట్టి సందర్భాల్లో బాధితులకు భరోసాగా ఉంటుంది, ఇంటికి వెళ్లి కేసు నమోదు చేయడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపినారు. మొదటి కేసు నమోదు చేసిన నడిగూడెం పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

tpolice registered the first FIR

You cannot copy content of this page

Scroll to Top