కృష్ణాజిల్లా : జనవరి 20: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం, పెదపట్నం గ్రామానికి చెందిన సంతోష్, రాజేష్ అనే ఇద్దరు యువకులు పుట్టినరోజు వేడుకల్లో గొడ్డలితో కేక్ కట్ చేశారు. వాళ్లు మద్యం సేవించి వీరంగం సృష్టించారు.
ఈ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్లపై నిఘా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


