Birthday Celebrations : ఘనంగా జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 10/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, పుట్రేల గ్రామం, వీర రాఘవపురం నికి చెందిన గరికపాటి. వెంకటేశ్వరరావు దంపతుల కూతురు తన్మయ్ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, సూరంపాలెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి వీర ఆంజనేయ ఆలయం వద్ద ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వచ్చిన బంధువులందరకు లడ్డు మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది.

బంధువులు అందరూ కూడా ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు , చల్లగా సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్లు ఆశీర్వదించారు. వచ్చిన బంధువులందరికీ విందు భోజనాలు పెట్టి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా, లేకుండా ఆ దంపతులు చూసుకున్నారు. ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ , ఉంటాయని బంధువులు అనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Birthday celebrations in grand style

You cannot copy content of this page

Scroll to Top