Request to Kolan Hanmanth Reddy : చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రాంగణంలో బోరుబావి మంజూరు చేయాలి – కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీరామ్ నగర్ పరిధిలోని రోడమెస్త్రి నగర్–బి ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రాంగణంలో బోరుబావి మంజూరు చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని చర్చి ప్రతినిధులు వినయపూర్వకంగా కోరారు.

చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌లో క్రమం తప్పకుండా ఆరాధన సేవలు, ప్రార్థన సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, అయితే ప్రస్తుతం చర్చి ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత నెలకొందని వారు వివరించారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి సమస్య తీవ్రమై, చర్చి సభ్యులు మరియు సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బోరుబావి ఏర్పాటు చేయడం ద్వారా చర్చి యొక్క ప్రాథమిక నీటి అవసరాలు తీరడమే కాకుండా, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 600 మందికి పైగా ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.వినతిని సానుకూలంగా స్వీకరించిన కొలన్ హన్మంత్ రెడ్డి , సంబంధిత అధికారులతో చర్చించి బోరుబావి మంజూరు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎండీ. లాయక్, అజయ్, బి.ప్రేమ్ దాస్, ఎం.నూకరాజు, ఎం.సుకుమార్, ఆర్.శంకర్, ఆర్.శివరాజ్, మల్లికార్జున, సాల్మన్, ఏసు, దేవదాస్, మరియాల మహేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Request to Kolan Hanmanth Reddy

You cannot copy content of this page

Scroll to Top