దేవరకొండ డివిజన్ జనవరి 12 త్రినేత్రం న్యూస్. కేజీవిబి ఉపాధ్యాయురాలు నాగమణి కుటుంబ సభ్యులకు రూ 6,00,000/- ల కుటుంబ సంక్షేమ నిధి చెక్ పంపిణీ చేశారు.
ఇటీవల మరణించిన టీ ఎస్ యు టీ ఎఫ్ – ఎఫ్ దుబ్లూ ఎస్ సభ్యురాలు పోతం నాగమణి, సి ఆర్ టీ, కె జీ బీ వీ గుండ్లపల్లి,నల్లగొండ జిల్లా ఆమె కుటుంబ సభ్యులకు టీ ఎస్ యు టీ ఎఫ్ గుండ్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో 6 లక్షల రూపాయల ఎఫ్ డబ్ల్యూ ఎస్ చెక్కు ను దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలూనాయక్ , టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కా,,చావా రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కా,,యం.
రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేషం, నల్లగొండ జిల్లా కన్వీనర్ గేర నర్సింహ. ఉన్నారు .ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ నాగమణి మేడం కి శ్రద్ధాంజలి ఘటిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఒక లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది.
అలాగే టీ ఎస్ యు టీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి మాట్లాడుతూ దహన సంస్కారాలకు కూడా చేయూత లేని కే.జీ.బీ.వీ. సీఆర్టీలను , పెన్షన్ లేని సీ.పీ.ఎస్. టీచర్లకు ఆసరాగా, మానవతా సాయం కోసం, ప్రత్యేక పరామర్శే ఎఫ్.డబ్ల్యూ.ఎస్…నిధి.. అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, దేవరకొండ డివిజన్ నాయకులు, గుండ్లపల్లి మండల బాధ్యులు, నాయకులు, కెజిబివి బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


