Dr. Methuku Anand : బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటింటికి బి ఆర్ ఎస్ కార్యక్రమంలో ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ* లోని 32 వ వార్డు శివరాం నగర్ కాలనీ లో పర్యటించడం జరిగింది.పర్యటనలో భాగంగా వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ..
ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని పేరే ఇంటింటికి బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏమేమి సంక్షేమ ఫలాలు అందడం జరిగింది, ప్రతి వార్డులో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అనే విషయాలను తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంటింటికీ బి ఆర్ ఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది.
ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా వికారాబాద్ మున్సిపాలిటీ లోని 32 వ వార్డు.శివరాం నగర్ కాలనీ లో పర్యటించడం జరిగింది.
ఇక్కడ గమనిస్తే వార్డులో చెత్త ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా నిండిపోయింది. వార్డు ప్రజలను అడిగితే. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న మమ్మల్ని కోపగించుకుంటున్నారే తప్పా చెత్త మాత్రం తీసుకుపోవడం లేదు అని వారు వాపోతున్నారు వార్డులో మురుగు నిండిపోయింది, త్రాగే నీరు రాక జనాలు ఇబ్బంది పడుతున్నారు.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను కార్యక్రమం ద్వారా అన్ని శాఖల అధికారులను వెంట తీసుకుని, ప్రతి వార్డులో పర్యటించి, సమస్యలు తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించడం జరిగింది.ప్రజలు గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరం నడుస్తున్నా ఏ ఒక్క నాయకుడైన మీ ఇంటి ముందుకు వచ్చి చెత్త సమస్య, నీటి సమస్య, విద్యుత్ సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారా.
దొంగ హామీలు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడగడానికి మీ ముందుకి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి.
కెసిఆర్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణంలోని ప్రతి గల్లీలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడంతోపాటు.. వాకింగ్ ట్రాక్లు మరియు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు అవన్నీ కూడా సరైన నిర్వహణ లేక మరుగున పడుతున్నాయి.
ప్రజలందరూ గమనించాలి మీ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా. ఒకవేళ వాకింగ్ ట్రాక్ లు లేదా ఓపెన్ జిమ్ లు ఉంటే అవి వాడుకలో ఉన్నాయా.
మీకు ఏ నాయకుడు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందిస్తాడు అనే విషయాలను ప్రజలు దయచేసి ఆలోచించండి. రేపు వికారాబాద్ పట్టణంలో మున్సిపాలిటీకి సంభందించిన ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశంనిర్వహించబోతున్నాము. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరు కాబోతున్నారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bless the BRS party candidates

You cannot copy content of this page

Scroll to Top