భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 03 : (త్రినేత్రం న్యూస్ ) అశ్వరావుపేట, దమ్మపేట మండలాలలో గల గ్రామపంచాయతీ లు జమ్మిగూడెం, గున్నే పల్లి భారత రాష్ట్ర సమితి పార్టీ సర్పంచ్ లు ముద్దిన. వెంకట నరసమ్మ , తొ గర్త. అనిత మాట్లాడుతూ వాళ్లకు ఎంత మెజార్టీ వచ్చిందో , ఎన్ని వార్డులు గెలిచారో చెప్పారు.
అదేవిధంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని అన్నారు.. మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. మేము , ఉప సర్పంచ్ లు గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని సూచించారు..
ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని, ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తానని వివరించారు. అదేవిధంగా గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి ఉండాలని, వాళ్లు చేసేవృత్తులలో సిరిసంపదలు కలగాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, ఎటువంటి ఇభేదాలు లేకుండా, రాకుండా ,, నీతి, నిజాయితీ ధర్మం వైపు నిలబడాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


