ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,
Trinethram News : జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ కుటుంబం మొత్తం ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని, పరస్పర సహకారం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో ఎన్నికల బందోబస్తు, కేసుల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా భద్రత చర్యల అమలులో జిల్లా పోలీస్ సిబ్బంది చూపిన అంకితభావం, సమర్థత అభినందనీయమని తెలిపారు. ప్రత్యేకించి క్లిష్ట పరిస్థితుల్లోనూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించిన అధికారులను, సిబ్బందిని ప్రశంసించారు.
2026 సంవత్సరంలో కూడా అదే ఉత్సాహం, నిబద్ధతతో పని చేస్తూ, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్, సైబర్ అవగాహనను మరింత విస్తృతంగా ఉపయోగించి నేరాలను నియంత్రించాలని సూచించారు.
ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, పోలీస్ వ్యవస్థపై విశ్వాసం మరింత పెంచేలా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ గ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


