SP Sneha Mehra :ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఎన్నికల ఫలితాలు వచ్చినా ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధం… నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, జిల్లాలో మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే కొనసాగుతుందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ పేర్కొన్నారు.తొలి దశ ఫలితాలు వచ్చినా గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధం.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతున్నంతకాలం ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాల్సిందే. నియమాలను అతిక్రమించే వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. శాంతియుత వాతావరణం కోసం ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Victory celebrations are banned until the election code of conduct ends

You cannot copy content of this page

Scroll to Top