త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, స్వగృహం నందు నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.
ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేను కలసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలతో, దుశ్శాలువాలతో సత్కరించి ఆయనతో కేక్ కటింగ్ లు చేయించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కొత్త సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


