త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆటో డ్రైవర్స్‌కు గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి అవగాహన కల్పించారు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల పాటింపు, సురక్షిత ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు, వాహన ధ్రువపత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ ల ప్రాముఖ్యత వివరించారు.
సీఐ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్స్ సహకారం ఎంతో కీలకమని, ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనం నడిపితే అనేక ప్రమాదాలను నివారించవచ్చని సీఐ తెలిపారు.
మీరు నడిపే ఆటో లలో మీ కుటుంబం, తల్లితండ్రుల ఫోటో లు పెట్టుకోండి. మీరు ఏదైనా తప్పు చేసిన, మద్యం తాగి ఆటో లు నడిపిన ఫోటో చూసినప్పుడు మీరు చేసే తప్పు వల్ల కుటుంబం రోడ్డు పై పడవలసి వచ్చి ఇబ్బందులు పడవలసి వస్తుందనే స్పృహ తో ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారని సూచించారు.
ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ వారికీ అందించాలని, కొంతమంది ఆటో డ్రైవర్స్ ప్రవర్తన, చేసే పనుల వలన అందరికి చెడ్డ పేరు వస్తుందని అలాంటి వారి సమాచారం పోలీస్ కి తెలియచేయాలనీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
ఆటో కి సంబందించిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పేపర్స్ ఉండాలని, ప్రతి డ్రైవర్ కి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వర్తించాలి అంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి కావున అందరు అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


